కశ్మీర్ ఫైల్స్ సినిమాని యూట్యూబ్ లో పెట్టండి

కశ్మీర్ ఫైల్స్ సినిమాని యూట్యూబ్ లో పెట్టండి

న్యూఢిల్లీ: కశ్మీర్ ఫైల్స్ సినిమాని యూట్యూబ్ లో పెట్టాలని, అట్లయితే అందరూ చూస్తారని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ గవర్నమెంట్ కశ్మీర్ ఫైల్స్ మూవీకి ట్యాక్స్ రిలాక్సేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న తరుణంలో కేజ్రీవాల్ ఈ విధంగా స్పందించారు. గురువారం ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ... కశ్మీర్ ఫైల్స్ సినిమాకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చాయని బీజేపీ నాయకులు చెబుతున్నారని, అవన్నీ ఎందుకు యూట్యూబ్ లో పెడితే ప్రజలు ఫ్రీగా చూస్తారు కదా అని కౌంటర్ ఇచ్చారు. అందుకు కశ్మీర్ ఫైల్స్ యూనిట్ తో మాట్లాడి ఏర్పాటు చేయాలని బీజేపీకి సవాల్ విసిరారు. కశ్మీర్ పండిట్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వ్యాపారం కోసం కశ్మీర్ పండిట్లను వాడుకోవడం సిగ్గుచేటన్నారు. చిత్ర బృందం కంటే కూడా బీజేపీ నాయకులే కశ్మీర్ ఫైల్స్ సినిమాని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

రా రైస్ పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిస్తలె

తెలంగాణను బెంగాల్‎గా మార్చొద్దు