మెడికల్ ట్రీట్‌మెంట్‌కు పుతిన్ గ్రీన్ సిగ్నల్‌.. బెర్లిన్‌కు నవాల్నీ తరలింపు

మెడికల్ ట్రీట్‌మెంట్‌కు పుతిన్ గ్రీన్ సిగ్నల్‌.. బెర్లిన్‌కు నవాల్నీ తరలింపు

మాస్కో: రష్యా ప్రతిపక్ష నేత, యాంటీ కరప్షన్ క్యాంపెయినర్ అలెక్సీ నవాల్నీ కోమాలో ఉన్న సంగతి తెలిసిందే. నవాల్నీపై విష ప్రయోగం చేశారని ఆయన అధికార ప్రతినిధి కిరా యర్మీష్‌ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో మెరుగైన మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం నవాల్నీని జర్మనీకి తీసుకెళ్లారు. నవాల్నీ విదేశం వెళ్లడానికి అనుమతించాలని ఆయన కుటుంబ సభ్యులు, ఉద్యమకారులు, ఇంటర్నేషనల్ లీడర్స్‌ ప్రెసిడెంట్ పుతిన్‌కు అభ్యర్థించడంతో రెండ్రోజుల తర్వాత ఆయనను జర్మనీ తీసుకెళ్లడానికి రష్యా అధికారులు అనుమతించారు.

బెర్లిన్‌లోని ఛారిటీ ఆస్పత్రిలో నవాల్నీకి చికిత్స అందించనున్నారు. సైబేరియాలోని టామ్స్క్‌ నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా విమానంలో నవాల్నీ తూలిపడ్డారు. దీంతో మరో సైబేరియన్ సిటీ అయిన ఓమ్స్క్‌లో ఫ్లయిట్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. సెప్టెంబర్‌‌లో రీజనల్ ఎలక్షన్స్‌ నేపథ్యంలో లోకల్ యాక్టివిస్ట్‌లు, ప్రతిపక్ష అభ్యర్థులను కలవడం కోసం నవాల్నీ టామ్స్క్‌కు వెళ్లారని సమాచారం.