
అరవై ఆరేళ్ల వయసులోనూ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నారు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. జూడోలో బ్లాక్ బెల్ట్ సాధించిన పుతిన్ సోమవారం నేషనల్ ప్లేయర్స్ తో తలపడి ఒక్కొక్కరినీ వరుసగా ఓడించారు. మిగతా ఆటగాళ్లలా స్పోర్ట్స్ డ్రెస్ లో రింగ్ లోకి వచ్చి, అందరితో కలిసి వామప్ చేశారు. ఆపై ఒక్కో ఆటగాడితో తలపడి అందర్ని ఓడించారు. దీనికి సంబంధించి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయింది. అయితే చివర్లో రియో ఒలంపిక్స్ రజత పతక విజేత నటాలియా కుజిటిటినా చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమిని స్పోర్టివ్ గా తీసుకుని ఆమెను అభినందించారు!