మలేషియా మాస్టర్స్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్స్ లో తైజు యింగ్ చేతిలో ఓడిపోయింది. 13-21, 21-12, 12-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ సెట్ ని 13-21 తో చేజార్చుకున్న సింధు.. సెకండ్ సెట్ తో పుంజుకుని 21-12తో తైజు యింగ్ ను ఓడించింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో తైజు యింగ్ సింధుకు ఎక్కడా అవకాశమే ఇవ్వకుండా 21-12తో మ్యాచ్ ను ముగించింది. దీంతో సింధు ఇంటిబాట పట్టక తప్పలేదు.
అయితే తైజు యింగ్ పై పీవీ సింధుకు మెరుగైన రికార్డు లేదు. ఇద్దరు 22సార్లు తలపడితే..17 మ్యాచుల్లో తైజు గెలవగా..5 మ్యాచుల్లో మాత్రమే సింధు గెలిచింది. ఇటీవల ముగిసిన మలేషియా ఓపెన్ క్వార్టర్స్ లోనూ సింధు తైజు చేతిలో ఓడిపోయింది.
