సింధు, ప్రణయ్ ఔట్

సింధు, ప్రణయ్ ఔట్

కౌలాలంపూర్ : మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియా షట్లర్ల పోరాటం ముగిసింది. భారీ ఆశలు పెట్టుకున్న పీవీ సింధు, హెచ్.ఎస్. ప్రణయ్.. క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టారు. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ లో ఏడోసీడ్ సింధు 21-13. -- రెండోసీడ్ తై జు (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. తాజా విజయంతో తై జు ముఖాముఖి రికార్డును 16-5కు పెంచుకుంది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్ లో ప్రణయ్ 18-21, 16-21తో ఏడోసీడ్ జోనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు.