ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు: మంత్రి ఉత్తమ్

 ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు: మంత్రి ఉత్తమ్


సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ లో రామస్వామి గట్టు సమీపంలోని సింగల్ బెడ్ రూమ్ ఇండ్ల పైలాన్ ను ఈరోజు (మార్చి14)న ఆవిష్కరిచారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,  గృహ, రెవెన్యూ మరియు నీటి, పౌర సరఫరాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి 35000 ఇళ్లు మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

దేవాలయ భూములు కొనుగోలు చేసి హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయాలని మనసారా కోరుకున్నానని ఆయన అన్నారు. మరో ఆరునెలల్లో హూజుర్ నగర్ లో ఇళ్లులేని ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేస్తామని మాట ఇచ్చారు. 2009 లో తాను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2160 ఇండ్ల నిర్మాణం 80 శాతం పూర్తి చేశానన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. 

ఇప్పుడు రూ. 70 కోట్లతో పునః నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. హుజూర్ నగర్ ప్రజల ఆశీస్సులతో 7సార్లు గెలిచానని అన్నారు. ఇక్కడ ఇంటర్నేషన్ రెసిడెన్షియన్ స్కూల్, 100పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని, కాంగ్రెస్ హయాంలోనే హుజూర్ నగర్ అభివృద్ధి జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 4లక్షల 50వేల  ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. త్వరలో రేషన్ కార్డ్ లేనివారికి రేషన్ కార్డు ఇస్తామని, 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. 2160 ఇళ్ల నిర్మాణానికి రూ.74.80 కోట్లు మంజూరు చేస్తామని పొంగులేటి  ప్రకటించారు. గత ప్రభుత్వ చేసిన తప్పుల వల్లే నీళ్లు ఇవ్వలేక పోయామని, కరువు వచ్చిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్, ధరణి పేర్లు చెప్పుకొని దోచుకున్న సొమ్మును బయటపెడతామని మంత్రి పొంగులేటి శపథం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చాలా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువేనని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తాను చాలా మాస్ లీడర్ అని, స్పీకర్ కుర్చీలో కూర్చొబెట్టి సోనియా గాంధీ నా నోరు మూయించారని చెప్పారు.  గత ప్రభుత్వం అప్పుల చేసి పోయినా, 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.