కేశనపల్లిలో కోతిని మింగిన కొండ చిలువ

కేశనపల్లిలో కోతిని మింగిన కొండ చిలువ
  •  దాన్ని చంపేసిన కోతుల మంద
  • పెద్దపల్లి జిల్లా కేశనపల్లిలో ఘటన

ముత్తారం, వెలుగు: కోతిని కొండ చిలువ మింగిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. ముత్తారం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన చొప్పరి రవీందర్ ఇంటి ఆవరణలోకి సోమవారం ఏడు అడుగుల పొడవైన కొండచిలువ వెళ్లింది. అక్కడ కోతి ఉండగా.. మింగడానికి నోటితో పట్టుకోవడంతో గట్టిగా అరిచింది. 

దీంతో కోతుల మంద అరుస్తూ అక్కడికి చేరింది. కొండచిలువపై దాడికి దిగినా..విడవకుండా కోతిని పూర్తిగా మింగేసింది. ఆ తర్వాత కొండచిలువపై కోతుల దాడి చేసి చంపేశాయి. దీంతో ఒక్కసారిగా కోతులు ఆరవగా భయంతో గ్రామస్తులు పరుగు తీశారు.