క్యూఆర్ కోడ్తో నేషనల్ హైవే డీటైల్స్

క్యూఆర్ కోడ్తో  నేషనల్ హైవే డీటైల్స్
  • అందుబాటులోకి తెస్తున్నకేంద్ర రవాణా శాఖ 

న్యూఢిల్లీ, వెలుగు: ఇకపై ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మనం ప్రయాణించే జాతీయ రహదారి(ఎన్​హెచ్) పూర్తి సమాచారాన్ని పొందొచ్చు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్​హెచ్​ఏఐ) ఫీల్డ్ ఆఫీస్‌‌‌‌తో పాటు అక్కడికి దగ్గరలోని ఆస్పత్రులు, పెట్రో ల్ పంపులు, టాయిలెట్లు, పోలీస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, టోల్ ప్లాజాకు దూరం, ట్రక్ లే బై, వాహన సర్వీస్ స్టేషన్లు/ఈ ఛార్జింగ్ స్టేషన్ల వంటి సౌకర్యాల గురించి తెలుసుకోవచ్చు.

 నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనదారుల సౌలభ్యం కోసం ఈ క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్ర రవాణా శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందు లో భాగంగా హైవేల పక్కన, టోల్ ప్లాజాల వద్ద క్యూర్ కోడ్ లతో కూడిన సమాచార సైన్ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.