జనగామ, వెలుగు: టీచర్లు విద్యార్థులను తమ పిల్లలుగా భావించి మంచిగా చదువు చెప్పాలని జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. వారికి నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన మీటింగ్‌లో బడిబాటలో ఎంతమంది స్టూడెంట్స్ప్రభుత్వ స్కూళ్లలో చేరారని, ఇంకెందరిని చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.
దీంతో 9 వేల మందిని చేరుస్తామని ఎంఈవోలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు ఇవన్నీ అందేలా టీచర్లు బాధ్యతగా వ్యవహారించాలన్నారు. మీటింగ్‌లో ఎడ్యుకేషన్ఇన్చార్జ్ఏడీ శ్రీనివాస్, జీసీడీవో గౌసియా, ఎంఈవోలు ఉన్నారు.
రీ టెండర్ నోటిఫికేషన్
జిల్లాలోని కేజీబీవీలు, హాస్టల్స్‌కు నిత్యావసర వస్తువుల సరఫరా కోసం కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈవో సందీప్‌కుమార్ ఝా రీ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ విద్యాసంవత్సరంలో కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ సరఫరా కోసం నియోజకవర్గాల వారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పూర్తి వివరాలకు డీఈవో ఆఫీస్‌లో సంప్రదించాలని సూచించారు.
