
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ అయిన క్వాలిజీల్, తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమం "డిజిటల్ యాక్సెస్"లో భాగంగా హైదరాబాద్లో పేద స్టూడెంట్లకు లాప్ట్యాప్లను అందజేసింది. ఈ కార్యక్రమం కోసం నిర్మాణ్ అనే ఎన్జీఓతో చేతులు కలిపింది.
డిజిటల్ అంతరాన్ని తగ్గించడం విద్య, నైపుణ్యాభివృద్ధికి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా డిజిటల్యాక్సెస్ కార్యక్రమాన్ని చేపట్టామని కంపెనీ తెలిపింది. "డిజిటల్ యాక్సెస్" కార్యక్రమం కింద తెలుగు రాష్ట్రాల్లో క్వాలిజీల్, నిర్మాణ్తో కలిసి డిజిటల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం, కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలను నిర్వహించడం వంటివి చేపట్టింది.