ఇండియాకు నేరుగా దక్కని క్వార్టర్స్‌‌‌‌ బెర్త్‌‌‌‌

ఇండియాకు నేరుగా దక్కని క్వార్టర్స్‌‌‌‌ బెర్త్‌‌‌‌

భువనేశ్వర్‌‌‌‌: ఎఫ్‌‌‌‌ఐహెచ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో.. డైరెక్ట్‌‌‌‌గా క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌కు అర్హత సాధించాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో ఇండియా మామూలు విక్టరీతో సంతృప్తి పడింది. గురువారం పూల్‌‌‌‌–డిలో జరిగిన ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా 4–2తో వేల్స్‌‌‌‌పై నెగ్గింది. ఇండియా తరఫున షంషేర్‌‌‌‌ సింగ్‌‌‌‌ (21వ ని.), అక్షదీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ (32వ, 45వ ని.), హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ (59వ ని.) గోల్స్‌‌‌‌ చేయగా, ఫుర్లాంగ్‌‌‌‌ గారెత్‌‌‌‌ (42వ ని.), జాకబ్‌‌‌‌ డార్పెర్‌‌‌‌ (44వ ని.) వేల్స్‌‌‌‌కు గోల్స్‌‌‌‌ అందించారు. ఓవరాల్‌‌‌‌గా ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌ల్లో రెండు విజయాలు, ఓ డ్రాతో 7 పాయింట్లు సాధించిన ఇండియా రెండో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకుంది. స్పెయిన్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌లో 4–0తో నెగ్గిన ఇంగ్లండ్‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌గా క్వార్టర్స్‌‌‌‌కు చేరింది. ఇరుజట్ల ఖాతాలో చెరో ఏడు పాయింట్లే ఉన్నా.. గోల్‌‌‌‌ డిఫరెన్స్‌‌‌‌ కారణంగా ఇంగ్లండ్‌‌‌‌ (9) టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ను చేజిక్కించుకోగా, ఇండియా (4) రెండో ప్లేస్‌‌‌‌కు పరిమితమైంది. స్పెయిన్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌ ప్లేయర్లు రోపెర్‌‌‌‌ ఫిల్‌‌‌‌ (10వ ని.), కాండోన్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ (21వ ని.), నికోలస్‌‌‌‌ (50వ ని.), అన్సెల్‌‌‌‌ లియామ్‌‌‌‌ (51వ ని.) గోల్స్‌‌‌‌ చేశారు. ఇక క్వార్టర్స్‌‌‌‌ బెర్త్‌‌‌‌ కోసం ఇండియా.. ఆదివారం జరిగే క్రాస్‌‌‌‌ ఓవర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌తో తలపడనుంది. 

పెనాల్టీలే దెబ్బ..

మ్యాచ్‌‌‌‌ ఆరంభం నుంచి మెరుగ్గా ఆడిన ఇండియాను పెనాల్టీలు దెబ్బకొట్టాయి. అయితే చిన్నచిన్న పాస్​లతో ఆడుతూ వచ్చిన ఇండియా 22వ నిమిషంలో షంషేర్‌‌‌‌ గోల్‌‌‌‌తో లీడ్‌‌‌‌లోకి వచ్చింది. మరో 10 నిమిషాల తర్వాత అక్షదీప్‌‌‌‌ దాన్ని డబుల్‌‌‌‌ చేశాడు. అయితే థర్డ్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో లభించిన రెండు పెనాల్టీలను వేల్స్‌‌‌‌ ప్లేయర్లు గోల్స్‌‌‌‌గా మల్చడంతో స్కోరు 2–2తో ఈక్వల్‌‌‌‌ అయ్యింది. వెంటనే అక్షదీప్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ గోల్‌‌‌‌ చేసి స్కోరును 3–2కు పెంచాడు. చివరకు 60వ నిమిషంలో హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కొట్టిన లెఫ్ట్‌‌‌‌ కార్నర్‌‌‌‌ షాట్‌‌‌‌ గోల్‌‌‌‌పోస్ట్‌‌‌‌లోకి దూసుకుపోయింది. 

నెదర్లాండ్స్‌‌‌‌ రికార్డు విక్టరీ

మూడుసార్లు చాంపియన్‌‌‌‌ నెదర్లాండ్స్‌‌‌‌.. పూల్‌‌‌‌–-సిలో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. చిలీతో జరిగిన మ్యాచ్‌‌‌‌లో 14--–-0తో నెగ్గి డైరెక్ట్‌‌‌‌గా క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌ బెర్త్‌‌‌‌ను ఖాయం చేసుకుంది. దీంతో వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో బిగ్గెస్ట్‌‌‌‌ మార్జిన్‌‌‌‌ విక్టరీ సాధించిన టీమ్‌‌‌‌గా రికార్డులకెక్కింది. గతంలో ఆసీస్‌‌‌‌ 12--–0తో సౌతాఫ్రికాపై గెలిచింది. నెదర్లాండ్స్‌‌‌‌ తరఫున జిప్‌‌‌‌ జాన్సెన్‌‌‌‌ (6వ, 29వ, 34వ, 44వ ని.), కెప్టెన్‌‌‌‌ థియరీ బ్రింక్‌‌‌‌మన్‌‌‌‌ (25వ, 33వ, 58వ ని.), కోయెన్‌‌‌‌ బీజెన్‌‌‌‌ (40వ, 45వ ని.), డెర్క్‌‌‌‌ విల్డెర్‌‌‌‌ (22వ ని.), వాన్‌‌‌‌ డామ్‌‌‌‌ (23వ ని.), పీటెర్స్‌‌‌‌ (37వ ని.), జస్టిన్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ (42వ ని.), బెనిస్‌‌‌‌ (48వ ని.) గోల్స్‌‌‌‌ చేశారు. మరో మ్యాచ్‌‌‌‌లో మలేసియా 3–2తో న్యూజిలాండ్‌‌‌‌కు షాకిచ్చింది.