బ్రిటన్‌లో అర్థశతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2కి అధికారులు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 1965లో మాజీ ప్రధాన మంత్రి విన్‌స్టన్ చర్చిల్ ఈ గౌరవాన్ని పొందిన చివరి దేశాధినేత. గత 295 ఏళ్లల్లో ప్రభ్యత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగని ఏకైక చక్రవర్తి ఎడ్వర్డ్ 8. అతను పదవి విరమణ చేయడంతో ఆ గౌరవాన్ని పొందలేకపోయారు. బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలో అత్యధిక కాలం(70) పరిపాలకురాలిగా కొనసాగిన ఎలిజబెత్ 2.. నిన్న వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.
ఎలిజబెత్ 2కు ప్రిన్స్ ఫిలిఫ్ వలే రాచరిక అంత్యక్రియలు కాకుండా బ్రిటన్ ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇలా సార్యభౌమాధికారికి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. సైనిక ఊరేగింపులో నేవికి చెందిన నావికులు గన్‌క్యారేజీపై ఎలిజబెత్ మృతదేహాన్ని తీసుకువెళ్లడంతో అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ప్రజలు సందర్శనార్ధం రాష్ట్రభవనంలో ఆమె భౌతికదేహాన్ని ఉంచుతారు. అంత్యక్రియలకు దాదాపు నాలుగు రోజులు ముందు వరకు ఆమె భౌతిక దేహం వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో ఉంటుంది. తదనంతరం దేశాధినేతలకు 21 తుపాకుల గౌరవ వందనం ఇస్తారు.
1926లో జన్మించిన ఎలిజబెత్-2... ప్రిన్స్ ఫిలిప్ మౌంట్ బాటెన్‌ను 1947లో వివాహమాడారు. 22 ఏళ్ల వయసులోనే ఆమె బ్రిటన్ రాణి కిరీటం ధరించారు. బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలో అత్యధిక కాలం(70) పరిపాలకురాలిగా కొనసాగారు.
