R Ashwin: బుమ్రా కాదు అతడే టీమిండియా టెస్ట్ కెప్టెన్‌కు కరెక్ట్.. మాట మార్చిన అశ్విన్

R Ashwin: బుమ్రా కాదు అతడే టీమిండియా టెస్ట్ కెప్టెన్‌కు కరెక్ట్.. మాట మార్చిన అశ్విన్

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భారత టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఓపెనర్ తో పాటు కెప్టెన్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంగ్లాండ్ తో జూన్ 20 నుంచి జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఎవరు టీమిండియాను నడిపిస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. రేస్ లో చాలా మంది క్రికెటర్లు ఉన్నప్పటికీ సుదీర్ఘ ఫార్మాట్ కు ఎవరు మంచి ఎంపిక అనే విషయంలో బీసీసీఐ గందరగోళంలో ఉంది. 

మాజీ సీనియర్ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి భారత టెస్ట్ కెప్టెన్ ఎవరనే టాపిక్‎పై టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రియాక్ట్ అయ్యాడు.కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్ ప్లేయర్లు రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో జట్టులో సీనియర్‎గా ఉన్న బుమ్రా కెప్టెన్‌గా ఉండాలని అశ్విన్ పేర్కొన్నాడు.

అయితే ఈ కామెంట్స్ చేసిన కొన్ని రోజులకే అశ్విన్ మాట మార్చాడు.తమిళనాడు మాజీ ఓపెనర్ విద్యుత్ శివరామకృష్ణన్‌తో యూట్యూబ్ చాట్‌లో అశ్విన్ మాట్లాడుతూ టెస్ట్ కెప్టెన్ గా జడేజా పేరును ప్రస్తావించాడు. మీడియా హెడ్‌లైన్స్ శుభ్‌మాన్ గిల్‌ను భవిష్యత్ కెప్టెన్ అని చెబుతుండగా అశ్విన్ తన స్పిన్ సహచరుడు జడేజాకు మద్దతుగా నిలిచాడు.

"మనం రవీంద్ర జడేజా గురించి ఎందుకు మర్చిపోతాము?”. ఇది కూడా ఏదో అనుకోకుండా చేసిన వ్యాఖ్య కాదు. అంతా ఆలోచించే మాట్లాడుతున్నాను. జడేజా ఇప్పుడు కేవలం యుటిలిటీ ఆటగాడు మాత్రమే కాదు. అతను బ్యాట్, బాల్, ఫీల్డ్ తో పాటు కెప్టెన్సీ కూడా చేయగలడు. జడేజా రానున్న రెండేళ్లు ఇండియాకు కెప్టెన్సీ చేయాలి. అతని నాయకత్వంలో యంగ్ క్రికెటర్లు అనుభవం సంపాదించిన తర్వాత వారికి టెస్ట్ పగ్గాలు అప్పగించాలి". అని అశ్విన్ అన్నాడు. 

►ALSO READ | Rohit Sharma: కలలో కూడా ఊహించలేదు: రోహిత్ శర్మ స్టాండ్ ప్రారంభోత్సవంలో హిట్ మ్యాన్ కామెంట్స్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం (మే 7) టెస్టు ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకున్న హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్ వన్డేల్లో కొనసాగుతానని తెలిపాడు. దీంతో రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే కెప్టెన్సీ చేయనున్నాడు. జూన్ 20న మొదలయ్యే ఈ టూర్ కోసం సెలెక్టర్లు వారంలో టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించనుండగా..  కెప్టెన్సీ రేసులో బుమ్రా, రాహుల్, శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్, రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్ ఉన్నారు. 

ప్రస్తుత వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రాకు ఇప్పటికే  కొన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో జట్టును నడిపించిన అనుభవం ఉంది. కానీ, ఫాస్ట్ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడం, తరచూ గాయాలు అవుతున్నందున బుమ్రాను ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే విషయంలో సెలెక్టర్లు, బోర్డు పెద్దలు వెనకడుగు వేస్తున్నారు. బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలకడ లేకపోవడం ప్రతికూలం కానుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకరికి పగ్గాలు అప్పగించే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపిస్తోంది. దీంతో భారత క్రికెట్ లో తొలిసారి మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లను చూడబోతున్నాం.        

Ravichandran Ashwin identifies Ravindra Jadeja as a candidate to be India's next Test captain. pic.twitter.com/uZnYjT8k1X

— Circle of Cricket (@circleofcricket) May 15, 2025