Rohit Sharma: కలలో కూడా ఊహించలేదు: రోహిత్ శర్మ స్టాండ్ ప్రారంభోత్సవంలో హిట్ మ్యాన్ కామెంట్స్!

Rohit Sharma: కలలో కూడా ఊహించలేదు: రోహిత్ శర్మ స్టాండ్ ప్రారంభోత్సవంలో హిట్ మ్యాన్ కామెంట్స్!

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ భారత జట్టుకు చేసిన కృషికి ఫలితం లభించింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ రోహిత్ భారత క్రికెట్ కు చేసిన సేవలకు గాను గుర్తింపుగా వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్ కు తన పేరును పెట్టారు. శుక్రవారం (మే 16) సాయంత్రం 4:30 గంటలకు వాంఖడే స్టేడియంలో కొత్తగా పేరు మార్చబడిన మూడు స్టాండ్‌లను ప్రారంభ వేడుకలు స్టార్ట్ అయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన రోహిత్.. తన స్పీచ్ ద్వారా ముంబై క్రికెట్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలిపాడు. 

రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. చిన్నప్పుడు నేను ముంబై, ఇండియా తరపున క్రికెట్ ఆడాలని అనుకున్నాను. కానీ వాంఖడే స్టేడియంలో నా స్టాండ్ ఉంటుందని కలలో కూడా ఊహించలేదు". అని రోహిత్ ఈ వేడుకలో చెప్పుకొచ్చాడు. వాంఖడే స్టేడియంలోని దివేచా పెవిలియన్ లెవల్ 3 పేరును రోహిత్ శర్మ స్టాండ్ గా మార్చి సొంత స్టేడియంలో హిట్ మ్యాన్ కు ఘనమైన నివాళి ఇచ్చారు.

Also Read :  ఢిల్లీకి భారీ ఊరట.. యార్కర్ల వీరుడికి బంగ్లాదేశ్ బోర్డు గ్రీన్ సిగ్నల్

వాంఖడేలో ఇప్పటికే స్టాండ్‌ల పేరు పెట్టబడిన సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, విజయ్ మర్చంట్ వంటి  దిగ్గజాల సరసన రోహిత్ చేరాడు. గ్రాండ్ స్టాండ్ లెవల్ 3 కి మాజీ బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ పేరును.. అదేవిధంగా గ్రాండ్ స్టాండ్ లెవల్ 4 ను భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ పేరును పెట్టి వారికి అంకితం చేయనున్నారు. గత నెలలో జరిగిన ముంబై క్రికెట్ అసోసియేషన్ 86వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు.
 
రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2024లో టీ20 వరల్డ్ కప్ గెలవడంతో పాటు 2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. బ్యాటర్ గా మూడు ఫార్మాట్ లలో 19 వేలకు పైగా పరుగులు చేశాడు. ముంబై తరపున హిట్ మ్యాన్ 46 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 17 లిస్ట్ ఏ గేమ్‌లతో పాటు 25 టీ20లు ఆడాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఇటీవలే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. దీంతో రోహిత్ ఇకపై టీమిండియా తరపున వన్డేలు మాత్రమే ఆడనున్నాడు.