IPL 2025: ఢిల్లీకి భారీ ఊరట.. యార్కర్ల వీరుడికి బంగ్లాదేశ్ బోర్డు గ్రీన్ సిగ్నల్

IPL 2025: ఢిల్లీకి భారీ ఊరట.. యార్కర్ల వీరుడికి బంగ్లాదేశ్ బోర్డు గ్రీన్ సిగ్నల్

ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్ ల కోసం బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ జట్టులో చేరతాడా లేదా అనే విషయంలో సస్పన్స్ వీడింది. అతను ఐపీఎల్ లోని మిగిలిన మ్యాచ్ లు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడనున్నాడు. జాతీయ జట్టు తరపున మ్యాచ్ లు ఉన్నప్పటికీ అతనికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్ ఆడుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం (మే 16) ఈ బంగ్లా పేసర్ కు నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో ఢిల్లీ త్వరలోనే ముస్తాఫిజుర్ ఢిల్లీ జట్టులో చేరతాడు. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఆదివారం (మే 18) ఈ బంగ్లా ఫాస్ట్ బౌలర్ ఢిల్లీ జట్టులో చేరనున్నట్టు సమాచారం. 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా తొలి మ్యాచ్ శనివారం (మే 17) షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ సిరీస్ కోసం స్క్వాడ్ లో ఎంపికైన ముస్తాఫిజుర్.. ఐపీఎల్ ఆడడనే వార్తలు వచ్చాయి. మ్యాచ్ కోసం అతను యూఏఈ కి వెళ్ళాడట. అయితే ఇంతలో బంగ్లా బోర్డు ముస్తాఫిజుర్ కు ఐపీఎల్ ఆడేందుకు అనుమతిని ఇవ్వడంతో యూఏఈ నుంచి ఇండియాకు రానున్నాడు. నలుగురు ఫారెన్ ప్లేయర్స్ ఢిల్లీ జట్టును వదిలి వెళ్లడంతో ఢీలా పడిన క్యాపిటల్స్ కు ఇది ఊరట కలిగించే విషయం. 

Also Read : హ్యాండిచ్చిన స్టార్క్, డుప్లెసిస్

ఐపీఎల్ 2025రీ స్టార్ట్ కు ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ దూరమయ్యాడు. అతని స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 6 కోట్లకు ముస్తాఫిజుర్ ఢిల్లీ జట్టులో చేరనున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.2 కోట్లతో ఆక్షన్ లోకి వచ్చినా ముస్తాఫిజుర్ అన్ సోల్డ్ గానే మిగిలిపోయాడు. బంగ్లాదేశ్ తరఫున ముస్తాఫిజుర్  106 టీ20ల్లో 132 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 11 మ్యాచ్ ల్లో 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.