ప్రభుత్వం మెడలు వంచి దళిత బంధు తీసుకోవాలె : ఆర్ కృష్ణయ్య

ప్రభుత్వం మెడలు వంచి దళిత బంధు తీసుకోవాలె : ఆర్ కృష్ణయ్య

దళిత బంధు స్కీంను ఎమ్మెల్యేల పరిధి నుంచి తీసివేయాలన్నారు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత బంధు కొరకు ఎస్సీ 57 ఉపకులాల లొల్లి...అనే అంశంపై ధర్నా చేపట్టారు. ఈ ధర్నలో ఆర్ కృష్ణయ్య పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఎస్సీ ఉపకులాకు పూర్తీగా మద్దతు తెలుపుతున్నమని తెలిపారాయన. దళిత బంధులో ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని దళితులతో పాటు ఉప కులాల వారీకి కూడా ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి దళిత బంధు తీసుకోవాలని ధ్వజమెత్తారు ఆర్ కృష్ణయ్య. 

రాష్ట్రంలో ఉప కులాలు పేదరికంలో ఉన్నాయని చెప్పిన కృష్ణయ్య.. రాజకీయ నేతలు ఓబీసీలను ఓట్ల కోసం వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు లేక విద్యార్థలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో ఎస్సీ ఉప కులాల పిల్లలకు స్పాట్ అడ్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆర్ కృష్ణయ్య. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణం భూ కబ్జాలే అని పేర్కొన్నారాయన.