ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి : ఆర్ కృష్ణయ్య

ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి : ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వమే నేరుగా కార్పొరేషన్ ద్వారా పే స్కేల్ ఇవ్వాలని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్​చేశారు. శనివారం ఇందిరాపార్క్​ ధర్నా చౌక్​లో  స్టేట్ ఔట్​సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ఆయనతోపాటు ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి, సుధీర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. తొలగించిన ఔట్​సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. వారికి ఉద్యోగ భద్రతతోపాటు ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.