నిజంగా అద్భుతం : ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ పై హీరో పొగడ్తలు

నిజంగా అద్భుతం : ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ పై హీరో పొగడ్తలు

ఐటీ రిఫండ్ కోసం మామూలుగా  ఒక్కొక్కరికి ఒక్కో సమయం పడుతుంది.కొందరకి రోజులు పడితే.. కొందరు నెలల తరబడి ఎదురుచూస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా  ప్రముఖ యాక్టర్ ఆర్.మాధవన్ కు కేవలం 3 వారాల్లోనే ఐటీ రిటర్న్ అందుకున్నట్లు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది తనకు ఆశ్యర్యంగా ఉందంటూ ఐటీ పనితీరుపై ప్రశంసలు కురిపించారు.

2023-24 కు సంబంధించి ఐటీ రిటర్న్ ఫైల్ చేసిన మూడు వారాల్లోనే తమ కంపెనీకి ఐటీ రిటర్న్ వచ్చిందని మాధవన్ తెలిపాడు.  ఇంత వేగంగా ఐటీ రిటర్న్ రావడం ఓకింత ఆశ్యర్యంగా ఉందన్నారు. ఐటీ శాఖ పనితీరు అధ్బుతమంటూ  ప్రశంసలు కురిపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు అలాగే. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు మాధవన్ ట్యాగ్ చేశారు.  

మాధవన్ ట్వీట్ పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు.  తొమ్మిది నెలలుగా పెండింగ్ లో ఉందని  ఒకరు.. ఐదు నెలలైనా ఐటీ రిటర్న్ కాలేదని మరొకరు కామెంట్ చేశారు.