విద్యుత్ చట్టం కూడా రద్దు చేయాలె

V6 Velugu Posted on Nov 25, 2021

నాగర్ కర్నూలు: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మహోన్నత పోరాటం చేసి విజయం సాధించారని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. దాదాపు ఏడాదిపై గా పోరాడి, సుమారు 750 మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరుకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపడంతో కేంద్రప్రభుత్వం దిగొచ్చి, వాటిని రద్దు చేసిందన్నారు. రైతుల ఉద్యమం స్ఫూర్తితో తాను రైతన్న సినిమా తీసినట్లు చెప్పారు. రైతన్న సినిమాను అందరూ చూడాలని కోరారు.  విద్యుత్ సంస్కరణల చట్టం కూడా కేంద్రం రద్దు చేయాలని.. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఆర్. నారాయణ మూర్తి.

 

Tagged Telangana, pm modi, R Narayana Murthy, Farmer\\\\\\\'s, Rythanna Movie

Latest Videos

Subscribe Now

More News