చిన్న సినిమాలను ఆదుకోవాలి: ఆర్ నారాయణ మూర్తి

చిన్న సినిమాలను ఆదుకోవాలి: ఆర్ నారాయణ మూర్తి

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు అవకాశం ఇవ్వాలన్నారు ఆర్ నారాయణ మూర్తి. నిర్మాతలను కాపాడాల్సిన అవసరం ఉందని... ప్రస్తుతం కొద్ది మంది చేతుల్లోనే సినిమా ఇండస్ట్రీ ఉందని.. తెలుగు చిత్ర పరిశ్రమ ఏ ఒక్కరిదీ కాదన్నారు. తమిళ్ ఇండస్ట్రీలో అన్ని సినిమాలకు అవకాశం ఇచ్చినట్లే టాలీవుడ్ లోనూ ఛాన్స్ వచ్చేలా కేసీఆర్ చర్యలు తీసుకోవాలన్నారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆర్ నారాయణ మూర్తి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎలక్షన్ లో ఏ ప్యానల్ గెలిచినా 80 శాతం నిర్మాతలకు ఉన్న కష్టాలను తీర్చాలన్నారు. పండగ సమయంలో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం వల్ల చిన్న సినిమాలకు అవకాశాలు రావడం లేదన్నారు. చిన్న సినిమాలకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు.  థియేటర్స్ కు మార్నింగ్ షో సమస్యలు తీర్చాలన్నారు.

ఉత్కంఠంగా కొనసాగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 4గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6గంటలకు రిజల్ట్ అనౌన్స్ చేయనున్నారు. దిల్ రాజ్, సి.కల్యాణ్ ప్యానళ్ల పోటీ పడ్డాయి. పొడ్యూసర్ సెక్టార్ నుంచి మొత్తం 810 ఓట్లు పోలయ్యాయి. ఈ ప్యానల్ నుంచి దాదాపు 1567 ఓట్లు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్ ప్యానల్ నుంచి 597 ఓట్లు ఉండగా.. దాదాపు 3వందలకుపైగా ఓట్లు పోలయ్యాయి. స్టూడియో సెక్టార్ నుంచి 98 ఓట్లు ఉండగా.. 68 ఓట్ల పోలయ్యాయి.