విద్యా వ్యవస్థలోని లోపాలపై ఆర్.నారాయణ మూర్తి యూనివర్సిటీ (పేపర్ లీక్) సినిమా

విద్యా వ్యవస్థలోని లోపాలపై ఆర్.నారాయణ మూర్తి యూనివర్సిటీ (పేపర్ లీక్) సినిమా

ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన యూనివర్సిటీ (పేపర్ లీక్) చిత్రం ఆగస్టు 22 న విడుదలవుతోంది.  ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో గోరటి వెంకన్న, అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, అందెశ్రీ, జయరాజ్, నందిని సిదారెడ్డి, ప్రొఫెసర్ ఖాసీం పాల్గొని విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా చూడాల్సిన చిత్రమని ప్రశంసించారు.

నారాయణమూర్తి మాట్లాడుతూ ‘మన విద్యారంగంలో గ్రూపు 1-, 2 సహా పలు ప్రశ్నపత్రాలు లీక్ అవుతుంటే విద్యార్థుల భవిష్యత్,  నిరుద్యోగుల జీవితాలు, ఏమైపోవాలి? అణు బాంబులు, సునామీల కంటే కాపీయింగ్ చాలా ప్రమాదకరమైనది. అందుకే విద్యను ప్రైవేటు మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి  చేసి జాతీయం చేయాలి. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చాటి చెప్పేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించా. ఇందులోని 5 పాటలను కీ.శే. గద్దర్, జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేష్  గొప్పగా రాశారు’ అని తెలిపారు.