
గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యంపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పీ పట్నాయక్. తాజాగా ఆయన మ్యూజిక్ చేసిన చిత్రం అహింస. డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ఈ సినిమాలో దగ్గుబాటి అభిరామ్, గీతిక తివారి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా జున 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా గ్యాప్ తరువాత ఆర్ పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న సినిమా ఇది కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన "నీతోనే.. నీతోనే" అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పీ పట్నాయక్. ఈ ఇంటర్వ్యూలో అహింస సినిమా గురించి చాల విషయాలు చెప్పుకొచ్చాడు. అలాగే బాలు గారి గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.. "సినిమాలు చేస్తున్నా లేకపోయినా నేను రోజుకి 18 గంటలు పని చేస్తాను. ప్రస్తుతం కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నాను. అలాగే కొన్ని కథలు కూడా రాస్తున్నాను. అయితే నాకు సంగీతం ఎక్కువ పేరు తీసుకొచ్చింది. కానీ ఒక సందర్భంలో నేను మానేశాను. కానీ బాలు గారు మాత్రం నేను ఎక్కడ కనిపించినా మళ్లీ సంగీతం ఎప్పుడు మొదలు పెడుతున్నావ్ అని అడిగేవారు. అడిగిన ప్రతిసారీ చేస్తాను గురువు గారు అని చెప్పేవాడిని.
నేను సినిమాలు చేయకపోవడానికి కారణం నాకు కథ నచ్చకపోడమే. బాలు గారు వెళ్లిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయాననే గిల్ట్ ఎక్కువ అయ్యింది. అందుకే ఒకసారి తేజను కలిసి మళ్లీ మ్యూజిక్ చేయాలి అది బాలు గారి కోరిక అని చెప్పాను. కొద్ది రోజులకు తేజ ఫోన్ చేసి మనం సినిమా చేస్తున్నాం. అదే అహింస అని చెప్పుకొచ్చారు ఆర్ పీ పట్నాయక్.