కెప్టెన్సీ కావాలని ఆరాటపడ్డాడు: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్

కెప్టెన్సీ కావాలని ఆరాటపడ్డాడు: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్

భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనిల మధ్య స్నేహం గురించి అందరికీ తెలుసు. అయితే, 2014లో ధోని నుంచి టెస్ట్ పగ్గాలు అందుకున్న విరాట్ .. వైట్ బాల్ కెప్టెన్సీ విషయంలో ఆరాటపడ్డాడని మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ అన్నాడు. కోహ్లీ 2016లో వన్డే, టీ20ల సారథ్యం కూడా కావాలని కోచ్, బోర్డ్ సభ్యులపై ఒత్తిడి తెచ్చాడని అన్నాడు. ఏడేండ్లు టీమిండియాతో కలిసి పనిచేసిన శ్రీధర్ ఈ విషయాలన్నీ తను రాసిన ‘కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ఇండియన్ క్రికెట్ టీం’ బుక్ లో వెల్లడించాడు.

‘‘కెప్టెన్సీ విషయంలో తొందరపాటు వద్దని నేను కూడా చాలాసార్లు విరాట్ కి వివరించా. కానీ, ఆయనే ఆరాటపడ్డాడు. వైట్ బాల్ కెప్టెన్ బాధ్యతలు కావాలని కోరుకున్నాడు. రవి శాస్త్రి కూడా ఒక సాయంత్రం విరాట్ కి ఫోన్ చేసి ‘చూడు విరాట్, ధోని నీకు రెడ్ బాల్ కెప్టెన్సీ ఇచ్చాడు. ఆ నిర్ణయంలో నువ్వు అతన్ని గౌరవించాలి. పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్సీని కూడా ఇస్తాడు. కానీ, దానికి సరైన సమయం రావాలి. అంతేగాని తన నిర్ణయాన్ని నువ్వు గౌరవించకుండా కెప్టెన్సీ కావాలని కోరుకుంటున్నావు. ఇప్పుడు అతన్ని నువ్వు గౌరవించకపోతే, రేపు నువ్వు  కెప్టెన్‌గా ఉన్నప్పుడు నీకూ గౌరవం లభించదు’ అని చెప్పాడు. అంతేకాకుండా 2019 వరల్డ్ కప్ టైంలో ధోని ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడో కూడా నాకు ముందే తెలుసని’ శ్రీధర్ తన బుక్ లో వెల్లడించాడు.  2020 ఆగస్టు 15న ధోని అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలసిందే..