ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి మరోసారి బ్రేక్ .. నవంబర్ 5 కు వాయిదా వేసిన సుప్రీం

ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి మరోసారి బ్రేక్ ..    నవంబర్ 5 కు వాయిదా వేసిన సుప్రీం

అమరావతి ఆర్‌-5 జోన్‌‌పై (R-5 Zone) సుప్రీంకోర్టులో (Supreme Court) శుక్రవారం ( సెప్టెంబర్ 1)  విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి నవంబర్ 5కు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఆర్‌-5 జోన్‌పై హైకోర్టు ఆర్డర్‌పై స్టే ఇచ్చేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులకు రిజైన్డర్స్ దాఖలు చేసేందుకు మూడు వారాల గడువు ఇస్తూ.. తదుపరి విచారణను నవంబర్‌ 5కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు ఆర్డర్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.

ధర్మాసనం స్పందిస్తూ.. ఆర్‌-5 జోన్‌ వ్యవహారానికి, రాజధాని అంశానికి సంబంధం ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్‌ సంఘ్వీ వాదనలు విపించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసమే ప్రభుత్వం ఆ ప్రాజెక్టు చేపట్టిందని తెలిపారు. పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీనిపై హైకోర్టు స్టే ఇచ్చిందని కోర్టుకు వివరించారు.