Atlee Daughter Name: డైరెక్టర్ అట్లీ దంపతుల కూతురి పేరు ‘మియూ’.. అర్థం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే

Atlee Daughter Name: డైరెక్టర్ అట్లీ దంపతుల కూతురి పేరు ‘మియూ’.. అర్థం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్, ఆయన భార్య ప్రియ అట్లీ అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకున్నారు. ఇటీవల ఏప్రిల్ 20, 2026న ఈ దంపతులు తమ రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తమ ముద్దుల కుమార్తె పేరును అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టును షేర్ చేశారు.

‘మియౌ’: అందమైన అర్థం ఇదే

ప్రియ అట్లీ దంపతులు తమ కుమార్తెకు “మియౌ (Miyou)” అనే ప్రత్యేకమైన జపనీస్ పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ పేరుకు అందం, సౌమ్యత, ప్రేమ అనే అందమైన అర్థాలు ఉన్నాయని దంపతులు పేర్కొన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు చిన్నారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. (‘మి’ అంటే అందమైనది. ‘యూ’ అంటే సౌమ్యం అని అర్ధం).

ఇప్పటికే ఈ క్రేజీ కపుల్‌కు ‘మీర్’ అనే కుమారుడు ఉన్నాడు. మీర్ అంటే ‘నాయకుడు’ అని అర్ధం. ఇలా కొడుకుకి, కూతురికి మొదట ‘మి’అనే అక్షరంతో అద్భుతమైన అర్ధాలతో కూడిన పేర్లు పెట్టడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. కాగా 2023 జనవరిలో జన్మించిన మీర్, ఇప్పుడు చెల్లెలు రాకతో అన్నయ్య పాత్రలోకి అడుగుపెట్టాడు. ఈ విధంగా కొడుకు, కూతురితో అట్లీ కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. ఇకపోతే అట్లీ-ప్రియా 2014లో వివాహం చేసుకున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priya Mohan (@priyaatlee)

అట్లీ ‘రాకా’:

డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం ‘రాకా’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మరియు దీపికా పడుకొణె నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అట్లీ రూపొందిస్తున్నారు. 

ఈ సినిమాను ఒక ‘పారలల్ యూనివర్స్’ (Parallel Universe) కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నారని టాక్. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం ఏకంగా రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.ఇందుకోసం అంతర్జాతీయ స్టూడియోలతో అట్లీ ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం బడ్జెట్ రూ.700 కోట్లు దాటే అవకాశం ఉంది.