రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25 చెక్ పోస్టులు

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25 చెక్ పోస్టులు

యాదాద్రి, వెలుగు: ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25 చెక్‌‌ పోస్టులు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ తెలిపారు. ఆదివారం యాదాద్రి జిల్లా మోత్కూర్ పోలీస్ స్టేషన్‌‌ను డీసీపీ రాజేశ్‌‌ చంద్రతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.  

ఎన్నికల నిర్వహణ, బందోబస్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  వాహనాల తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.25 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.  

ఎన్నికల నిర్వహణపై కమిషనరేట్ పరిధిలో పోలీసులను అలర్ట్ చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టినట్లు వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా,  ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చౌటుప్పల్ ఏసీపీ వి.మొగులయ్య, రామన్నపేట సీఐ మోతీరాం , మోత్కూర్ , ఆత్మకూరు(ఎం) ఎస్సైలు ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నాగరాజు ఉన్నారు.