
హైదరాబాద్: మేడిపల్లిలో డీజీల్ అక్రమ దందాకు సహకరిస్తున్న పోలీసులపై వేటు పడింది. డీజిల్ ముఠాకు సహకరించిన ఆరుగురు పోలీసులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సస్పెండ్ చేశారు. ఈ నెల18న మేడిపల్లిలో డీజీల్ చోరి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో భాగంగా ఆ ముఠాను విచారించడంతో ఆ దందాలో పోలీసుల హస్తం బయటపడింది. ఎస్ఓటీ ఇన్స్ పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, ఎస్బీ కానిస్టేబుల్ తో పాటు మేడిపల్లి ఠాణాకు చెందిన మరో ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెన్షన్ కు గురయ్యారు. ముఠాకు సహకరించిన వారిని సస్పెండ్ చేస్తూ సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కి గురైన వారి వివరాలు తెలియాల్సి వుంది.