గ్లోబల్ ఆస్పత్రి టు అపోలో ఆస్పత్రి..37 నిమిషాల్లో గుండె చేరవేత

గ్లోబల్ ఆస్పత్రి టు అపోలో ఆస్పత్రి..37 నిమిషాల్లో గుండె చేరవేత
  •     గ్రీన్ చానల్ ద్వారా గుండె తరలింపు
  •     29.1 కిలోమీటర్లు..

ఎల్​బీనగర్,వెలుగు :  గ్రీన్ చానెల్ ద్వారా లైవ్ ఆర్గాన్ ను తరలించి మానవత్వం చాటారు రాచకొండ పోలీసులు. ఎల్ బీ నగర్ లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ గుండెను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో మరో పేషెంట్ కు అమర్చేందుకు తరలించాల్సి ఉంది. 

రెండు ఆస్పత్రుల మధ్య సుమారు 29.1 కిలోమీటర్ల దూరం ఉండగా, రాచకొండ పోలీసులు గ్రీన్ చానల్ ద్వారా  ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 37 నిమిషాల్లోనే ఆస్పత్రికి తరలించారు. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకుని  సక్సెస్ పుల్ గా తరలించడంతో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు అభినందించాయి.