మీ ప్రాణం మాకు ముఖ్యం : రాచకొండ ట్రాఫిక్

మీ ప్రాణం మాకు ముఖ్యం : రాచకొండ ట్రాఫిక్

రాచకొండ ట్రాఫిక్, బాలాపూర్ పోలీసులు రాఖీ పండుగను వినూత్నంగా జరిపారు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ డ్రైవ్‌ చేసే వారికి మహిళా కానిస్టేబుళ్లతో రాఖీలు కట్టించారు. చెల్లితో రాఖీ కట్టించుకునేందుకు క్షేమంగా ఇంటికి చేరాలంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. బాలాపూర్ పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓ సుధాకర్, ఎస్​ఐలు, మహిళా కానిస్టేబుళ్లు హెల్మెట్‌పై వాహనదారుల్లో అవగాహన కలిగించారు.   - వెలుగు, ఎల్బీనగర్‌