ఐపీఎల్‌కు ముందు చెన్నై‌కి బిగ్ షాక్.. విదేశీ స్టార్లకు గాయాలు

ఐపీఎల్‌కు ముందు చెన్నై‌కి బిగ్ షాక్.. విదేశీ స్టార్లకు గాయాలు

దేశంలో ఐపీఎల్ హడావుడికి మరో నెల రోజులే సమయం ఉంది. ఈ మెగా లీగ్ కు సంబంధించి నిన్న (ఫిబ్రవరి 22) బీసీసీఐ మొదటి 21 రోజుల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ మ్యాచ్‌లు మార్చి 22 నుండి ఏప్రిల్ 7 వరకు జరుగుతాయి. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చెన్నై రికార్డ్ స్థాయిలో 9వ సారి సీజన్ తొలి మ్యాచ్ ఆడుతుంది. అయితే ఆ జట్టుకు తాజాగా అనుకోని షాక్ తగిలింది. ఇద్దరు ప్లేయర్లకు గాయాల బారిన పడ్డారు.
  
న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే, ఆల్ రౌండర్ రచీన్ రవీంద్రకు ప్రస్తుతం గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వారు ఈ రోజు (ఫిబ్రవరి 23) ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఆడలేదు. వెల్లింగ్‌టన్‌లో జరిగిన మొదటి టీ20 తర్వాత ఎడమ మోకాలి నొప్పి కారణంగా  రెండో టీ20 నుండి  రవీంద్రను తప్పించారు. ఇక ఈ మ్యాచ్ ఆడుతూ ఉన్న సమయంలో కాన్వే గాయపడ్డాడు. వీరి గాయాలపై ఎలాంటి స్పష్టత లేదు. దీంతో చెన్నై జట్టుకు భారీ ఎదరు దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తుంది. కాన్వే చెన్నై జట్టు తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. రచీన్ రవీంద్ర తొలిసారి సూపర్ కింగ్స్ తరపున తొలిసారి ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 

భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో రచీన్ రవీంద్ర అదరగొట్టిన సంగతి తెలిసిందే. 500 కు పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో రూ. 1.8 కోట్లు పెట్టి చెన్నై 2023 మినీ వేలంలో దక్కించుకుంది. ఈ మెగా టోర్నీ తర్వాత ఈ కివీస్ యంగ్ స్టార్ ఫార్మాట్ ఏదైనా చెలరేగిపోతున్నాడు. మరోవైపు కాన్వే గత రెండేళ్లుగా చెన్నై తరపున నిలకడగా ఆడుతూ జట్టు  విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో  ఫిబ్రవరి 21 న జరిగిన తొలి టీ20 లో వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఫామ్ లో ఉన్న ఈ ఇద్దరిపైనే చెన్నై భారీగా ఆశలు పెట్టుకుంది. మొత్తానికి వీరి గాయాలపై ఎప్పుడు స్పష్టత వస్తుందో చూడాలి.