నలుగురు కీలక నేతల ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్

నలుగురు కీలక నేతల ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్

ఫోన్ ట్యాపింగ్ లో మాజీ డీసీపీ రాధాకిషన్ రావ్ రిమాండ్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురు కీలక పార్టీ నేతల ఆదేశాలతో ఫోన్ ట్యాప్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో తెలిసింది. తన చిన్ననాటి మిత్రుడైన ఎమ్మెల్సీకి ఎన్నికల్లో రాధాకిషన్ పూర్తిస్థాయిలో సాయం చేసినట్లు గుర్తించారు పోలీసులు.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సహకారంతో డబ్బులను రవాణా చేసినట్టు నిర్ధారించారు. డబ్బులకు ఎస్కార్ట్ వాహనం ఇచ్చి మరీ డెలివరీ చేసినట్లు గుర్తించారు పోలీసులు. రాధా కిషన్ కి సహకరించిన ఎస్సైలు, ఇన్ స్పెక్టర్లతో పాటు మాజీ పోలీసు అధికారులను విచారించనున్నారు పోలీసులు. పలువురు రాజకీయనేతల విచారణకు రంగం సిద్దమయినట్లు తెలుస్తోంది.