రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు: విచారణకు హాజరైన డైరెక్టర్ క్రిష్

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు: విచారణకు హాజరైన డైరెక్టర్ క్రిష్

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న  డైరెక్టర్​ జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్‌‌‌‌).. మార్చి 1వ తేదీ శుక్రవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు హాజరైన క్రిష్ ను దాదాపు నాలుగు గంటల విచారించి.. సాంపిల్స్ తీసుకోని పంపించినట్లు తెలుస్తోంది. క్రిష్ బ్లడ్, యూరిన్ సాంపిల్స్ ను పోలీసులు ల్యాబ్ కు పంపించారు.  టెస్టులో పాజిటివ్ వస్తే క్రిష్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.డ్రగ్ టెస్టులో నెగటివ్ వచ్చినా... విట్నెస్ కింద మరోసారి ఆయనను విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. 

డ్రగ్స్‌‌ కేసు‌‌ వ్యవహారంలో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్‌‌‌‌ మంజూరు చేయాలని సినీ క్రిష్‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు.  ఆయన పిటిషన్ పై మార్చి 4న విచారణ చేపట్టనుంది.  డ్రగ్స్‌‌‌‌ వ్యవహారంలో ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు.. పోలీసులు క్రిష్‌‌‌‌ పేరును ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లో చేర్చారు.

ఈ డ్రగ్స్ కేసులో 12 మందిని FIRలో చేర్చారు పోలీసులు. ఇప్పటికే డ్రగ్ సప్లేయర్ అబ్బాస్, డ్రగ్ పెడ్లర్ వహీద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణకు హాజరుకాని వారికి నోటీసులు జారీ చేశారు. విచారణకు లేట్ గా అటెండ్ అయితే డ్రగ్ టెస్టులో నెగటివ్ వచ్చే అవకాశాలున్నాయని పోలీసులకు దొరక్కుండా నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.