తమిళనాడులో రాగింగ్ భూతం కలకలం రేపింది. చెయ్యార్ లోని అరిగ్నార్ అన్నా ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ నుంచి బయటపడిన వీడియో అందరినీ కలవరపెట్టింది. జూనియర్ స్టూడెంట్స్ ను బానిసలుగా చూస్తున్న 8మంది సీనియర్ విద్యార్థులను కాలేజీ నుంచి నెల రోజులపాటు సస్పెండ్ చేశారు.
ఆర్ట్స్ కాలేజీలోని ఆది ద్రావిడ హాస్టల్ లో చోటు చేసుకుంది. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఇష్టం వచ్చినట్లు ర్యాగింగ్ చేస్తున్నారు. జూనియర్స్ తో బట్టలు ఉతికించడం, రికార్డ్స్ రాయించడం, చదువుకుంటున్న వాళ్లను డిస్టర్బ్ చేయడం చేస్తున్నారు.
ఇవే కాకుండా తాజాగా రిలీజ్ అయిన ర్యాగింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్టల్ రూమ్స్ లో జూనియర్స్ బట్టలు ఊడదీయింది కొరడా లాంటి తాడుతో ఇష్టం వచ్చినట్లు కొడుతుంటారు. ఈ విషయంపై కాలేజీ ప్రిన్సిపల్ కు కంప్లైంట్ చేయగా.. ఎనిమిది మంది సీనియర్ విద్యార్థులపై యాక్షన్ తీసుకున్నారు. వాళ్లపై నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఇక మీదట జరగకుండా తీసుకునేలా చర్యలు తసకుంటామని కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు.