
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కిల్’లో విలన్‌గా నటించిన రాఘవ్ జుయల్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా మేకింగ్ వీడియోతో అతనికి బర్త్ డే విషెస్ చెప్పారు. ఇందులో అతని క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తున్న తీరుని బట్టి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. ఇక షారుఖ్ సినిమా ‘కింగ్’లోనూ రాఘవ్ జుయల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.