Chandramukhi 2 Review: చంద్రముఖి 2 మూవీ రివ్యూ

Chandramukhi 2 Review:  చంద్రముఖి 2 మూవీ రివ్యూ

రాఘవ లారెన్స్( Raghava Lawrence), కంగనా రౌనత్(Kangana Ranaut) కాంబోలో వచ్చిన మూవీ చంద్రముఖి 2(Chandramukhi 2). వీరిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ మూవీ ఇదే అయిన.. ఇలాంటి హారర్ చిత్రాలు చేయడంలో వీరు ఫస్ట్ టైం ఏం కాదు. కాంచన సీరీస్ తో హార్రర్ కామెడీ జోనర్ లో హిట్ల మీద హిట్లు కొట్టాడు లారెన్స్. రజినీకాంత్.. జ్యోతిక నటించిన చంద్రముఖి 1 ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకున్నదో తెలిసిందే. నాందండ చంద్రముఖి.. లక..లక..లక అంటూ ఎంతలా భయపెట్టిందో తెలిసిందే. దీంతో కంగనా చంద్రముఖి లా నటించి.. ఏ విధంగా ఆడియన్స్ భయపెట్టిందో తెలుసుకుందాం.

ALSO READ: వీరాభిమాని మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య

కథ :

చంద్రముఖి స్టోరీ ఎక్కడ ఎండ్ అయిందో.. పార్ట్ 2 అక్కడే స్టార్ట్ అవుతుంది. చంద్రముఖి భయపెట్టిన భవనంలోనే ఈ స్టోరీ నడుస్తుంది. చంద్రముఖి 2 స్టోరీని.. కమెడీయన్ వడివేలు క్యారెక్టర్ ను బేస్ చేసుకుని.. డైరెక్టర్ కథను అల్లుకున్నాడు. ఫస్ట్ పార్ట్ లో భయపెట్టడానికి చంద్రముఖి ఆత్మ వస్తే.. ఈ సెకండ్ పార్ట్ లో చంద్రముఖి కథనే ఆడియన్స్ కి చెప్పాడు డైరెక్టర్. చంద్రముఖి పగ పెంచుకున్న ఆ వెట్టయ్ రాజాతో స్టోరీ నడిపించడం సినిమా కొత్తదనాన్ని తీసుకొచ్చింది. ఇక వెట్టై రాజాగా నటించిన (రాఘవ లారెన్స్) ఎవరు? అసలు చంద్రముఖి ఫ్లాష్ బ్యాక్ ఏంటీ అనేది కథ..

రంగనాయకి (రాధిక శరత్ కుమార్) ఫ్యామిలీ చాలా పెద్దది. ఉన్నట్టుండి వారి కుటుంబానికి కొన్ని సమస్యలు వస్తాయి. ఫ్యామిలీ అంతా కలిసి వారి కుల దైవం గుడిలో పూజ చేస్తే సమస్యలు తొలగిపోతాయని స్వామీజీ (రావు రమేష్) చెప్తారు. వారి కులదైవం గుడికి దగ్గరలోనే చంద్రముఖి ప్యాలెస్ ఉంటుంది. ఆ ప్యాలెస్ లో మదన్ ( రాఘవ లారెన్స్) వచ్చి ఉంటాడు. ఆ  సంఘటన తర్వాత కైలాష్ (మొదటి చంద్రముఖిలో ప్రభు) ఫ్యామిలీ అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. ఇంటి మొత్తానికి ఓనర్ గా బసవయ్య (వడివేలు) చూసుకుంటాడు. రంగనాయకి ఫ్యామిలీని.. ఇంట్లోని దక్షిణం వైపు వెళ్లొద్దని బసవయ్య చెప్తుంటాడు. కొందరు చెప్పినా వినకుండా వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కథలో వేటయ్య రాజు/సెంగోటయ్య (ఇంకో రాఘవ లారెన్స్) పాత్ర ఏంటీ అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

విశ్లేషణ: 

చంద్రముఖి మూవీలో ఉన్న ఫ్రెష్ నెస్.. చంద్రముఖి 2లో కనిపించదు. హార్రర్ కామెడీ సినిమాలకి రాఘవ లారెన్స్ తన నటనతో వావ్ అనిపించాడు. డబుల్ రోల్ చేసి.. సినిమా మొత్తాన్ని తన భుజాల మోశాడు. రాఘవ లారెన్స్ నటిస్తున్నప్పుడల్లా.. పార్ట్ వన్ లో రజినీకాంత్ గుర్తుకు రావటం విశేషం. 

సినిమా స్టార్టింగ్ లో రాఘవ లారెన్స్ యాక్షన్ ఎపిసోడ్ కాస్త భయపెట్టినా.. తర్వాత అంతగా కనిపించలేదు. స్టోరీ నెమ్మదిగా సాగుతుంది. వడివేలు కామెడీ వర్కవుట్ కాకపోవడం మైనస్. ఫస్టాఫ్‌లో రాఘవ లారెన్స్ దయ్యాల్లోని రకాల గురించి వడివేలుకు ఎక్స్‌ప్లెయిన్ చేసే సీన్స్ 5 నుంచి 10 నిమిషాలు ఉంటుంది. ఈ సీన్స్ మల్లీశ్వరిలో వెంకటేష్, సునీల్‌కు కథ చెప్పే ఎపిసోడ్‌ను గుర్తు చేస్తుంది. ఈ సీన్ నవ్వించక పోగా ఆడియన్స్ ని విసిగిస్తుంది. చంద్రముఖి లో కనబడే పెయింటర్, దొంగ స్వామీజీలుగా వచ్చే మనోబాల పాత్రలు చంద్రముఖి 2లో రిపీట్ చేశారు. ఈ రెండు పాత్రలూ ఒకే సీన్‌లోనే వచ్చినా.. పెద్దగా వర్కవుట్ కాలేదు. కనీసం నవ్వించవు, భయపెట్టవు. ఇంటర్వెల్ బ్యాంగ్ వర్కవుట్ అవుతుంది. అక్కడ వచ్చే ట్విస్ట్‌ని ముందే గెస్ చేయగలిగినా.. కంగనా పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుంది. 

రాఘవ లారెన్స్, మహిమా నంబియార్‌ల లవ్ ట్రాక్, సాంగ్స్ కొంచెం విసిగించేలా ఉంటాయి. ఎప్పుడైతే వేటయ్య (దెయ్యం లారెన్స్) రాజు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ స్టార్ట్ అవుతుందో.. అక్కడ నుంచి స్టోరీలో ఏదో ట్విస్ట్ ఉంటుందని ఆడియన్స్ ఫీలవుతారు. అయితే ఆ స్థాయిలో కథను నడిపించలేకపోయాడు డైరెక్టర్ వాసు. ఫ్లాష్‌ బ్యాక్‌లో పెద్దగా పస లేకపోయినా పర్లేదనిపించిందంటే దానికి రాఘవ లారెన్స్, కంగనా రనౌత్‌ పెర్ఫార్మెన్స్ కారణం. క్లైమ్యాక్స్‌ను మళ్లీ మొదటి భాగం తరహాలోనే ముగించడం ఆడియన్స్ ని కాస్తా డిస్సప్పాయింట్ అయ్యేలా చేస్తాయి.

స్లో నరేషన్, స్టోరీలో కొత్తదనం మిస్సవ్వడం, హారర్ కామెడీ వర్కవుట్ కాకపోవడం సినిమాకు మైనస్ అని చెప్పుకోవాలి.  

చంద్రముఖి 2కు సంగీతం అందించిన కీరవాణి మార్క్ అయితే కనిపించలేదు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే వార్ సీన్‌లో.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాహుబలిని మూవీని గుర్తు చేస్తుంది. 

ఓవరాల్‌గా చెప్పాలంటే..

రజినీకాంత్ చంద్రముఖి’ మూవీని దృష్టిలో పెట్టుకోకుండా ఒక హార్రర్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్‌తో వెళ్తే చంద్రముఖి 2 సినిమా ఒకసారి చూడవచ్చు. పార్ట్ 1 అంచనాలతో వెళితే మాత్రం నిరుత్సాపరుస్తుంది. చంద్రముఖి 2 హిట్ అయితే చంద్రముఖి 3 రజనీతో మళ్లీ చేస్తానని డైరెక్టర్ వాసు చెప్పిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా చూశాక రజనీ ఆ సాహసం చేస్తారో లేదో చూడాలి మరి!