ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ జైలుకు వెళ్లాల్సింది హరీశ్ : రఘునందన్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్  జైలుకు వెళ్లాల్సింది హరీశ్ : రఘునందన్ రావు

బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానికి షిప్ అని అన్నారు మెదక్  బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు.  కేసీఆర్ ఫ్యామిలీ టైటానిక్ షిప్ నుంచి బయటకు రావాలన్నారు.  రంజిత్ రెడ్డి నుంచి కడియం కావ్య వరకు బీఆర్ఎస్ ను వీడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉండగా అక్రమాలు చేశారని ధ్వజమెత్తారు.  

మామకు మించి అబద్ధాలు ఆడటం హరీశ్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు రఘునందన్ రావు.  ఫోన్ ట్యాపింగ్ లో మొదట జైలుకు వెళ్లాల్సింది హరీశ్ రావేనన్నారు.  జిల్లాలో 78 కేసులు పెట్టుకుని జై తెలంగాణ అన్నది తానేనన్నారు.  తాను ఎవరి జోలికి వెళ్లను..తన జోలికి వస్తే ఊరుకోనని చెప్పారు.  17 స్థానాలను గెలిచి మోడీకి కానుకగా ఇస్తామన్నారు.  దుబ్బాక ఎన్నికల్లో తనను ,తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని..  రఘునందన్ కొడితే బీఆర్ఎస్  మొత్తం  మునిగిపోయిందన్నారు. గల్లీలో ఏది ఉన్నా.. ఢిల్లీలో మోడీ ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు.  నాలుగు దశాబ్దాలుగా కానీ పనులు ఐదేండ్లలో చేసి చూపిస్తానని చెప్పారు.  మెదక్ ఆత్మగౌరవాన్ని కాపాడేలా పనిచేస్తానని చెప్పారు. మెదక్ ఎన్నిక ఏకపక్షమన్నారు.