- మెదక్ ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట టౌన్, వెలుగు: యుద్ధాల కారణంగా ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ ఇచ్చిన సూచనలను కొందరు విమర్శించడం సరికాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమానికి ఆయన గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ కూడా వారి హయాంలో బంగారం కొనవద్దని ప్రజలకు సూచించారని గుర్తు చేశారు.
యుద్ధ పరిస్థితుల వల్ల ప్రజలకు ప్రధాని సూచనలు చేస్తే ప్రతిపక్షాలు రాజకీయం చేయడం బాధాకరమన్నారు. ప్రధాని మోదీ సూచనల మేరకు తాను కూడా ఎలక్ట్రిక్ వాహనాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. కరెంటుకు ప్రత్యామ్నాయంగా ప్రజలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్యాస్ వినియోగాన్ని తగ్గించి ఇండక్షన్ స్టవ్‌లను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, బాసంగారి వెంకట్, తుంగ కనకయ్య, సంతోష్, గోనె మార్కండేయులు పాల్గొన్నారు
