మెదక్ బీజేపీ అభ్యర్థి రేసులో రఘునందన్ రావు Vs అంజిరెడ్డి

మెదక్ బీజేపీ అభ్యర్థి రేసులో రఘునందన్ రావు Vs అంజిరెడ్డి

తెలంగాణలో 17ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన  బీజేపీకి అభ్యర్థుల కొరత ఎదురవుతుంది. ఇప్పటికే 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీకి నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి పార్లమెంట్ లలో బలమైన అభ్యర్థుల కొరత ఉంది.  ఈ నియోజకవర్గాల్లో  అభ్యర్థుల కోసం ఇతర పార్టీల వైపు మెగ్గుచూపుతుంది. ఎవరైనా వస్తారా! టికెట్ ఇస్తాం అన్నట్లుగా బీజేపీలో పరిస్థితి నెలకొంది. పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీకి టచ్ లో ఉన్నట్లుగా సమాచారం.  పస్ట్ లిస్ట్ లో 9  స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..మరో 8 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది.  ఈ నెల 8 న బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది.  9వ తేదీ ఉదయం వరకు  మిగిలిన 8 మంది బీజేపీ అభ్యర్థులు ఎవరు? అనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సీటు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు  బరిలో ఉంటారనేది ఉత్కంఠగా ఉంది. రెండు రోజుల వరకు మెదక్ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పేరే ఫైనల్ అని పార్టీ వర్గాల్లో ప్రచారం నడించింది. కానీ తాజాగా  మెదక్ అభ్యర్థిగా రేసులో గోదావరి అంజిరెడ్డి పేరు వినిపిస్తుంది. జాతీయ పెద్దలే రఘునందన్ రావు పేరును తీసుకోవడం లేదంటూ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. జాతీయ నేతలపై రఘునందన్ రావు గతంలో  చేసిన కామెంట్స్ ఆయనపై వ్యతిరేకకు కారణమై  ఉండొచ్చ అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి భర్తనే ఈ అంజిరెడ్డి. ప్రస్తుతం ఈయన ప్రస్తుతం బీజేపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు.