
చెత్తకుప్పలో డబ్బులు దొరికితే ఎలా ఉంటుంది. వాళ్లంత అదృష్ట వంతులు ఇంకెవరు ఉండరేమో.. మామూల్గ చిల్లర,పదో పరకా దొరికేతేనే వామ్మో డబ్బులు అని తీసుకుంటారు. మరి అలాంటిది ఏకంగా కోట్లకోట్లు దొరికితే ఇంకేమన్నా ఉందా? షాక్ అవ్వడం ఖాయం.. బెంగళూరులో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తికి 25 కోట్ల అమెరికా డాలర్లు దొరికాయి.
నవంబర్ 1న సల్మాన్ షేక్ అనే వ్యక్తి రోజులాగే చెత్తు ఏరుతుండగా 23 కట్టల అమెరికన్ డాలర్లు దొరికాయి. వెంటనే బ్యాగులో వేసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత ఏం చేయాలో మనోడికి అర్థంకాలేదు. దీంతో రెండు మూడు రోజుల తర్వాత తన యాజమాని బప్పాకు ఆ నోట్ల కట్టలను అందజేశాడు. తర్వాత బప్పా ఈ మ్యాటర్ ను సామాజిక కార్యకర్త కలీముల్లా దగ్గరకు తీసుకెళ్లారు. అతను బెంగళూరు పోలీస్ కమిషనర్ చెప్పాడు. వెంటనే ఈఘటనపై దర్యాప్తు చేయాలని హెబ్బాల్ పోలీస్ పోలీసులను ఆదేశించాడు.
వెంటనే దర్యాప్తు చేసిన పోలీసులు చెత్తకుప్పలో దొరికిన డాలర్ల విలువ రూ. 25 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఆ కరెన్సీ నోట్లపై కొన్ని కెమికల్స్ పూసినట్లు కూడా గుర్తించారు. దీంతో ఆ కరెన్సీ నోట్లు అసలు నకిలీవా?..లేక నిజమైనా కరెన్సీనో తేల్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపించారు. ఈ ఘటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.