
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పై ఇంటర్నేషనల్ టెర్రరిస్టు ముద్ర పడకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా మోకాలడడ్డడంపై రాజకీయ దుమారం రేగుతోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని, ఆయనో బలహీన ప్రధాని అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. చైనా చర్యలపై కనీసం నోరు కూడా మెదపడం లేదంటూ గురువారం ట్విటర్ లో మండిపడ్డారు . ‘‘జిన్ పింగ్ అంటే మోడీ వణికిపోతున్నారు. చైనా దౌత్యానికి దండం పెట్టారు . గుజరాత్‌లో ఆయనతో కలిసి ఊయలూగారు. ఢిల్లీలో కౌగలించుకున్నారు. చైనాలో ఆయన ముందు మోకలిరిల్లారు ’’ అని అన్నారు. పుల్వామా దాడి నేపథ్యం లో అజర్ పై నిషేధం విధించాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చేసిన ప్రతిపాదనకు సాంకేతిక కారణాలను సాకుగా చూపి చైనా అడ్డు తగిలిన సంగతి తెలిసిందే. చైనా ఇలా అడ్డుతగలడం ఇది మూడోసారి. దీంతో బీజేపీ, మోడీపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రధాని చేతగానితనం వల్లే మసూద్ మరోసారి తప్పించుకున్నాడని దుయ్యబట్టింది. ‘‘మసూద్ ను చైనా మరోసారి కాపాడింది. చైనా ప్రెసిడెంట్ తో కలిసి మోడీ ఊయలూగి ఏం ఫాయిదా? దేశ ప్రజల మదిలో ఇప్పుడు ఇదే ప్రశ్న మెదులుతోంది’’ అని ట్విటర్ లో కాంగ్రెస్ పేర్కొంది. పుల్వామాలో రక్తపాతానికి కారణమైన ఉగ్రవాది బీజేపీ తీరు వల్ల మరోసారి తప్పించుకున్నాడని, ఇది అంతర్జాతీయంగా ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న ప్రపంచ దేశాలకు చీకటిరోజని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా అన్నారు. మసూద్ ను కాపాడడం ద్వారా పాక్ –చైనా ఒక్కటేనన్న విషయం స్పష్టమైం దన్నారు.
ఇది ఎవరి పాపమో తెల్సుకో: జైట్లీ
భారత్‌ను కాదని చైనాకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించింది జవహర్ లాల్ నెహ్రూయేనని, ఈ పాపమంతా ఆయనదేనని బీజేపీ మండిపడింది. ‘‘చైనా, కాశ్మీర్ విషయంలో తప్పు చేసింది నెహ్రూ. అప్పుడు ఆయన చేసిన తప్పు వల్లే ఈ చిక్కులన్నీ. 1955 ఆగస్టు 2న నెహ్రూ అప్పటి ముఖ్యమంత్రులందరికీ లెటర్ రాశారు. ‘చైనాను ఐక్యరాజ్య సమితిలోకి, ఇండియాను భద్రతా మండలిలోకి తీసుకోవాలన్న ప్రతిపాదన అమెరికా నుంచి వచ్చింది. కానీ చైనాను మండలిలోకి తీసుకోకుం టే బాగోదన్న ఉద్దేశంతో ఆ ప్రతిపాదనను మేం ఆమోదించడం లేదు’ అని ఆ లెటర్ లో నెహ్రూ రాశారు. రాహుల్ .. ఇప్పుడు చెప్పు. ఎవరిది అసలు పాపమో’’ అని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నిలదీశారు. చైనా తీరుతో ఇండియా బాధపడుతున్న సమయంలో రాహుల్ ఎందుకు సంబరపడిపోతున్నారని మరో మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ‘‘రాహుల్ ట్వీట్ ను జైషే మహ్మద్ ఆఫీసులో సంబురంగా చూపించుకుంటారు. పాకిస్తాన్ లో మీ ట్వీట్ హెడ్ లైన్ లో వస్తుంది. అది మీకు ఆనందాన్నిస్తుంది. చైనాతో మీకు మంచి సంబంధాలుంటే.. మసూద్ పై చర్యలు చేపట్టాలని మానస సరోవర్ యాత్రలో ఆ దేశాన్ని ఒప్పిం చలేకపోయారేం? సున్నితమైన విదేశాంగ విధానం ట్విటర్ లో డిసైడ్ కాదన్న విషయాన్ని విషయాన్ని గుర్తుంచుకో. ఈ దేశాన్ని కాంగ్రెస్ 55 ఏళ్లు ఏలింది. విదేశాంగ విధానంపై మీ పార్టీ సరైన సలహా ఇస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఆయన ఫైర్ అయ్యారు.
కేరళలో శంఖారావం
త్రిసూర్ : కేరళలోని త్రిసూర్ లో జరిగిన ఫిషర్మెన్ పార్లమెంటు వేదికగా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి రాహుల్ సమరశంఖం పూరించారు. సీపీఐ, బీజేపీ టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ చెప్పిందే వేదమని, కాం గ్రెస్ ప్రజల మాటే వింటుందని అన్నారు. వయలెన్స్ ను ఆయుధంగా చేసుకుని ఎన్నికల్లో నెగ్గు కురావాలని బీజేపీ, సీపీఐ చూస్తున్నాయని ఆరోపించారు.