రాహుల్ కు ఉల్లిగడ్డ ఎలా పెరుగుతుందో కూడా తెలియదు

రాహుల్ కు ఉల్లిగడ్డ ఎలా పెరుగుతుందో కూడా తెలియదు

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై విమర్శలు చేశారు. ట్రాక్టర్లపై తిరిగినంత మాత్రాన వ్యవసాయం గురించి తెలుసుకోలేరని, సోఫాలపై కూర్చునే రాహుల్ గాంధీ వ్యవసాయ చట్టంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చివరికి ఉల్లిగడ్డ భూమి లోపల పెరుగుతుందో, బయట పెరుగుతుందో కూడా తెలియదన్నారు. ఎన్డీయే సర్కారు తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తుండటంపై శివరాజ్ సింగ్ చౌహన్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ కు కనీసం వ్యవసాయంలో ఒక్క విషయం అయినా తెలుసా అని ప్రశ్నించారు.

ఖేతీ బచావో యాత్ర పేరుతో కేంద్రం బిల్లులపై నిరసనలు తెలుపుతూ రాహుల్ పంజాబ్ లో ట్రాక్టర్ యాత్ర నిర్వహించారు. దీనిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా రాహుల్ ను వీఐపీ రైతు అంటే హేళన చేశారు. ట్రాక్టర్ పై మెత్తని పరుపు వంటి ఆసనంపై రాహుల్ కూర్చుని ఉన్న ఫొటోలు వైరల్ అవుతుండటంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.