ద్రవిడ్కు బంగ్లా కోచ్ క్షమాపణలు

ద్రవిడ్కు బంగ్లా కోచ్ క్షమాపణలు

భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు అలన్ డొనాల్డ్ క్షమాపణలు చెప్పారు.  1997లో దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ద్రవిడ్ పై  డొనాల్డ్ స్లెడ్జింగ్‌కి దిగాడు. అందువల్ల ద్రవిడ్కు క్షమాపణలు చెబుతూ ద్రవిడ్ ను డొనాల్డ్ డిన్నర్‌కి ఆహ్వానించాడు. అయితే అతని క్షమాపణలను అంగీకరించి ద్రవిడ్.. డిన్నర్‌కి రావాడానికి మాత్రం ఓ కండిషన్ పెట్టాడు. 

"డర్బన్‌లో జరిగిన  మ్యాచ్ లో  ద్రవిడ్, సచిన్ మా బౌలింగ్ ను  సమర్థవంతంగా ఎదురుకుంటున్నారు.  ఆ టైమ్ లో నేను ద్రవిడ్‌తో కొంచెం దురుసుగా ప్రవర్తించా. రాహుల్ కు, నాకు ఎలాంటి విభేదాలు లేవు.. అతనంటే నాకు గౌరవం కూడా ఉంది.  అతడి వికెట్ కోసం నేనలా చేసి ఉండాల్సింది కాదు. ఆ రోజు జరిగిన దాని గురించి మళ్లీ అతనికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ద్రవిడ్‌ చాలా మంచి వ్యక్తి.  ఒకరోజు ఆయనతో  డిన్నర్‌ చేయాలనుకుంటున్నాను " అని  ఓ ఇంటర్వ్యూలో డొనాల్డ్ చెప్పుకొచ్చాడు. 

అయితే ఈ వీడియోను చూసిన ద్రవిడ్ దీనిపై స్పందించాడు. ‘కచ్చితంగా వస్తా. నేను దాని కోసం ఎదురుచూస్తున్నా. బిల్లు మాత్రం అతడే కట్టాలి (నవ్వుతూ)’ అని పేర్కొన్నాడు. కాగా  అలన్ డొనాల్డ్  బంగ్లాదేశ్ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నారు. ప్రస్తుతం బంగ్లా, భారత్ జట్ల మధ్య ఫస్ట్ టెస్టు మ్యాచ్ నడుస్తోంది.