
శ్రీలంకతో జరగనున్న లిమిటెడ్ ఓవర్ల సిరీస్ కు భారత్ జూనియర్ టీమ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. కోహ్లీ కెప్టెన్సీలోని సీనియర్ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత మళ్లీ ఆగస్టులోనే మ్యాచులు ఆడనుంది. అప్పటి వరకు క్రికెట్ అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి జూనియర్ టీమ్ తో జూలైలో లిమిటెడ్ ఓవర్ల మ్యాచులను బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఈ టీమ్ కు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ను పంపాలని బీసీసీఐ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు మూడు నెలల పాటు ఇంగ్లాండ్ లోనే ఉండనుంది. ఈ టీమ్ తో పాటే హెడ్ కోచ్ రవిశాస్త్రి, సహాయ కోచింగ్ సిబ్బంది అక్కడికి వెళ్లనుంది. ఆ సమయంలో జూనియర్ టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక టూర్ కు బయల్దేరనున్నట్లు తెలిపింది బీసీసీఐ.