హోంమంత్రి అమిత్ షా కేసులో రాహుల్కు ఊరట..బెయిల్ మంజూరు

హోంమంత్రి అమిత్ షా కేసులో రాహుల్కు ఊరట..బెయిల్ మంజూరు

2018 పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యల కేసులో సుల్తాన్ పూర్ జిల్లా కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ఎన్నికల సందర్భంగా బెంగళూరులో హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో విజయ్ మిశ్రా అనే వ్యక్తి సుల్తాన్పూర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో సుల్తాన్ పూర్ లోని జిల్లా సివిల్ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. మంగళవారం ఈకేసు విచారణకు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం భారత్ జోడ్ న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు అమేథికి వెళ్లారు రాహుల్ గాంధీ. 

భారత్ జోడో న్యాయ్ యాత్ర మంగళవారంలో 38 వా రోజుకు చేరుకుంది. అమేధీ జిల్లాలో పురంత్ గంజ్ లతిరిగి ప్రారంభం అవుతుంది. ఈ యాత్ర రాయ్ మంగళవారం రాయ్ బరేలీ, లక్నో మీదుగా సాగనుంది. ఫిబ్రవరి 24 న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ నుంచి ఈ యాత్రలో చేరనున్నారు.  

2024 ఏప్రిల్ మే లో లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టింది. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ దాదాపు 55 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీని తిరిగి వశం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అంతేకాదు భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా పార్టీలో వచ్చే లోక్ సభ ఎన్నికల వరకు బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. 

Also Read : మార్చి 9 తర్వాత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్.?