మీ కోసం.. దేశం కోసం : రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర..

మీ కోసం.. దేశం కోసం : రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు రెడీ అవుతున్నారు. జోడో యాత్రకు కొనసాగింపుగా ఇది ఉండబోతుంది. 2024 అంటే వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ ఈ యాత్ర కొనసాగనుంది. అయితే దీనికి భారత్ జోడో యాత్రగా కాకుండా.. భారత్ న్యాయ యాత్ర పేరుతో చేపట్టనున్నారు.

రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ న్యాయ యాత్ర జనవరి 14వ తేదీ మణిపూర్ రాష్ట్రంలో ప్రారంభం అవుతుంది. మార్చి 30వ తేదీన ముంబై చేరుకుంటుంది. మొత్తం 6 వేల 200 కిలోమీటర్లు.. 14 రాష్ట్రాల్లో కొనసాగనుంది. 85 జిల్లాల్లో రాహుల్ సభలు నిర్వహించనున్నారు. దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం చేపట్టబోతున్న యాత్ర అని.. అందుకే భారత్ న్యాయ యాత్ర అని నామకరణం చేసినట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

రాహుల్ గాంధీ ఇప్పటికే భారత్ జోడో యాత్ర చేశారు. తమిళనాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టారు. ఇది రెండో యాత్ర. దీనికి న్యాయ యాత్రగా పేరు పెట్టటంతోపాటు.. ఆ యాత్రలో కేవలం నడవటమే కాకుండా.. మధ్యలో బస్సులో ప్రయాణించటం జరుగుతుందని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. 6 వేల 200 కిలోమీటర్ల మార్గంలో కొంత భాగం కొండ ప్రాంతాలు ఉన్నాయని.. ఇక్కడ వేలాది మంది జనంతో పాదయాత్ర చేయటం సాధ్యం కాదుకాబట్టి.. ఆయా ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ.

లోక్ సభ ఎన్నికలు రాబోతున్న సమయంలో.. ఎన్నిలకు రెడీ అవుతున్న సమయంలో.. 14 రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ చేపట్టబోతున్న భారత్ న్యాయ యాత్ర కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు, కిక్ ఇవ్వటం ఖాయం..