
వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాహనంపై గుర్తుతెలియని ఓ వ్యక్తి చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మోదీ తొలిసారి వారణాసిలో పర్యటించారు. మోదీ వాహనం వెళుతుండగా.. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి ఉన్న సమయంలో ఒక్కసారిగా మోదీ ప్రయాణిస్తున్న కారుపై చెప్పు పడింది.. వెంటనే దానిని సెక్యూరిటీ తీసి పారేయడం వీడియోలో కనిపిస్తున్నది.
అయిుతే ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జూన్ 20 గురువారం రోజున స్పందించారు. మీడియాతో మాట్లాడిన రాహుల్.. ప్రజలు మోదీని చూసి భయపడరు అంటూ కామెంట్ చేశారు. దేశంలో ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉన్నందున మోదీని చూసి ప్రజలు ఇప్పుడు భయపడడంలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ మానసికంగా కుప్పకూలారని అని రాహుల్ విమర్శించారు.