కాంగ్రెస్ వరాల జల్లు.. మమ్మల్ని గెలిపిస్తే ఉచిత కరెంట్.. నిరుద్యోగ భృతి : ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ వరాల జల్లు.. మమ్మల్ని గెలిపిస్తే ఉచిత కరెంట్.. నిరుద్యోగ భృతి : ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీ సర్కారు, మోడీ పాలనపై తీవ్రంగా మండిపడ్డారు. కోలార్ లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన రాహుల్.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. బీజేపీ సర్కారుపై ద్వజమెత్తిన రాహుల్..  ఎస్సీ, ఎస్టీలను మోడీ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. పీఎంవోలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ అధికారులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మోడీ, అదానీ గురించి ప్రశ్నించినప్పుడల్లా తన మైక్ లాగేస్తున్నారని, 
పార్లమెంట్ లో తన గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్ లో పెడ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్. తనపై పెట్టిన అక్రమ కేసులు, బ్యాన్ గురించి స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే.. అయన నవ్వాడని మండి పడ్డారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించాలని పలు హామీలు ఇచ్చారు. గృహలక్ష్మి కింద మహిళలకు రూ.2వేలు ఇస్తామని అన్నారు. నిరుద్యోగులకు రెండు సంవత్సరాల పాటు రూ. 3వేలు ఇస్తామని వెల్లడించారు. అన్ని రంగాలకు ఉచిత విద్యుత్తు ఇస్తామని హామీ ఇచ్చారు రాహుల్.