ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మోడీ రాజీ వల్ల భారత్ స్వతంత్ర వైఖరి కోల్పోయింది: ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్

ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మోడీ రాజీ వల్ల భారత్ స్వతంత్ర వైఖరి కోల్పోయింది: ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: ఇరాన్​యుద్ధంపై పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం మోదీ పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడుతూ యుద్ధ సంక్షోభాన్ని కరోనా మహమ్మారితో పోల్చారు. దానికి కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మోదీజీ కరోనా సమయంలో జరిగిన విషాదాలను మర్చిపోయారా..? అప్పుడు ఎందరు మరణించారో, ప్రజలు ఎంత కష్టపడ్డారో తెలుసా?’’ అని ప్రశ్నించారు.

 ఆక్సిజన్ కోసం ఆసుపత్రుల ముందు గంటల తరబడి నిరీక్షించిన దృశ్యాలు, శ్మశానాల వద్ద అంత్యక్రియల కోసం వరుస కట్టిన మృతదేహాల దృశ్యాలు అందరి మనసుల్లో ఉన్నాయని, ఆ విషాదాన్ని ప్రధాని ఇప్పుడు ఉదాహరణగా పేర్కొనడం తీవ్రమైన నిర్లక్ష్యమని ఫైర్ అయ్యారు.

మోదీకి రైతులు, ప్రజల ప్రయోజనాలు పట్టవు

ప్రస్తుతం అనుసరిస్తున్న విదేశాంగ విధానం సరిగా లేదని రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘భారత విదేశాంగ విధానం ఇప్పుడు మోదీ వ్యక్తిగత విధానంగా మారింది. దాన్ని ప్రపంచమంతా పెద్ద జోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూస్తోంది’’ అని ఆరోపించారు. 

అమెరికా–-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తునదని వస్తున్న రిపోర్టులపై స్పందిస్తూ, ఈ పరిస్థితిలో భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎటువంటి పాత్ర లేకపోవడం దేశ దౌత్యం బలహీనపడిందనేందుకు సూచనగా పేర్కొన్నారు. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మోదీ ఏం చేయగలరో, ఏం చేయలేరో బాగా తెలుసు. ప్రధాని రాజీపడితే మన విదేశాంగ విధానం కూడా రాజీపడినట్టే. అమెరికా, ఇజ్రాయెల్ చెప్పింది మోదీ చేస్తారు, భారత రైతులు, ప్రజల ప్రయోజనాలు పట్టించుకోరు’’ అని ఆరోపించారు.