కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది : రాహుల్ గాంధీ

కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది : రాహుల్ గాంధీ
  • 150 సీట్లు గెలవాలె...  కాంగ్రెస్ కర్నాటక లీడర్లకు రాహుల్ సూచన
  • ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తారని కామెంట్
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి దేశాన్ని కాపాడాలని పిలుపు

బెంగళూరు :  కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, ప్రజల నుంచి కూడా పార్టీకి మద్దతు పెరుగుతున్నదని మాజీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కచ్చితంగా 150 సీట్లు గెలవాలని నేతలకు సూచించారు. లేదంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ పడగొడుతుందని ఆరోపించారు. బీజేపీ అత్యంత అవినీతిమయమైన పార్టీ అని, కాంగ్రెస్ నుంచి గెలిచినోళ్లను డబ్బు ఆశ చూపి లాక్కునే ప్రయత్నం చేస్తదని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి దేశాన్ని కాపాడాలన్నారు. కర్నాటకలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ కోలార్, బీదర్, బెంగళూరులో నిర్వహించిన ప్రోగ్రామ్స్​లో పాల్గొని ఢిల్లీకి వెళ్లిపోయారు. బెంగళూరులో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘బీజేపీ దేశంలో చేస్తున్న విద్వేషం, హింస, వ్యవస్థలపై దాడుల గురించి మనందరికీ తెలుసు. కర్నాటకలో ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రజల నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఈ ఎన్నికల్లో మనం 224 సీట్ల నుంచి 150 స్థానాలు గెలుచుకోవాలి. ఎందుకంటే కర్నాటక ప్రజల నుంచి దోచుకున్న డబ్బులు బీజేపీ దగ్గర చాలా ఉంది.  మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పడగొట్టాలని ప్రయత్నం చేస్తది”అని రాహుల్ ఆరోపించారు. 

కలిసి ముందుకెళ్తున్నందుకు సంతోషం : రాహుల్

కర్నాటకలోని పార్టీ లీడర్ల మధ్య యూనిటీ బాగుందని, కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని రాహుల్ అన్నారు. దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి రక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపైనే ఉందన్నారు. మోడ్రన్​ ఇండియా నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. దేశంలోని వ్యవస్థలను, సంస్థలను రక్షించాల్సిన బాధ్యత తమపైనే ఉందని తెలిపారు. బస్వరాజు బొమ్మై నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి పాలన  కొనసాగిందని విమర్శించారు.

కాంగ్రెస్​లో చేరిన జగదీశ్ షెట్టర్​

బీజేపీ సీనియర్ లీడర్  జగదీశ్ షెట్టర్ కాంగ్రెస్​లో చేరారు. సోమవారం బెంగళూరులో ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా షెట్టర్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవం కాపాడుకునేందుకు బయటికొచ్చానని తెలిపారు. షెట్టర్​ రాకతో కాంగ్రెస్​ మరింత బలోపేతమైందని ఖర్గే అన్నారు. నార్త్​ కర్నాటకలో షెట్టర్​ నేతృత్వంలో మరిన్ని సీట్లు గెల్చుకుంటామన్నారు.