మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన రాహుల్ గాంధీ

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన రాహుల్ గాంధీ

మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. కుంగిన బ్యారేజ్ పిల్లర్లను పరిశీలించారు. రాహుల్‌ గాంధీ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ బ్యారేజీని హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అనంతరం మేడిగడ్డ హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్ కు తిరుగు పయనం అయ్యారు. 

అయితే ప్రాజెక్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ముందుగా రాహుల్ గాంధీని అంగీకరించలేదు. చివరకు కాంగ్రెస్‌ శ్రేణుల రిక్వెస్ట్‌తో ఏరియల్‌ సర్వేకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో ఆయన హెలికాఫ్టర్‌లోనే మేడిగడ్డను పరిశీలించారు. 

Also Read :- మేడిగడ్డ దగ్గర హైటెన్షన్

మేడిగడ్డ సందర్శనకు ముందు రాహుల్‌ గాంధీ అంబట్ పల్లి కాంగ్రెస్ మహిళా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట తెలంగాణ ప్రభుత్వం కరెప్షన్ చేసింది.  లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టామని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, డొల్లతనం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో బట్టబయలైందని ధ్వజమెత్తారు.